Nominations Last Day : నేడు నామినేషన్ల విత్‌డ్రాకు ఆఖరు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. తెలంగాణలో 625 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. ఏపీలో ఎంపీ ఎన్నికలకు 503 మంది, అసెంబ్లీ ఎన్నికలకు 2,705 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు ఆమోదించారు. కాగా ఇవాళ విత్‌డ్రాకు ఆఖరి రోజు కావడంతో పలు చోట్ల పార్టీల నుంచి బీ-ఫామ్‌లు రాని అభ్యర్థులు వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల ఎన్నికల సమరంలో అంతిమంగా నిలిచేదెవరో ఇవాళ తేలిపోనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల్లో చాలా మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకునే ఛాన్సుంది. ఇప్పటికే స్క్రూటినీలో కొందరి నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. తెరవెనుక చర్చలు, బుజ్జగింపులు, బేరసారాల అనంతరం అసంతృప్తులు, టికెట్లు దక్కక నామినేషన్లు వేసిన వారు వెనక్కి తగ్గే ఛాన్సుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com