CM Chandrababu : బాబుగారూ.. నితీశ్‌ను ఫాలో అవ్వండి.. షర్మిల సూచన

బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి ప్రధాని మోదీ ( Narendra Modi ) ముందర డిమాండ్ పెట్టారని.. ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ) కనీసం నోరు కూడా మెదపడం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. మోదీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న మీరు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తు లేవా? అని షర్మిల ప్రశ్నించారు.
హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు. మోసం చేసిన మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు... అని ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీలు కాదు... రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని గుర్తు చేస్తున్నామని షర్మిల తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com