AP : కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే పరిగెల

AP : కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే పరిగెల
X

ఎన్నికల వేళ కాంగ్రెస్‌లోకి (Congress) వలసలు కొనసాగుతున్నాయి. నిన్న నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ (MLA Arthur) హస్తం కండువా కప్పుకోగా.. తాజాగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ (Murali Krishna) కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మురళీకృష్ణ 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు.

2014లో మరోసారి బరిలోకి దిగగా.. ఓటమి చెందారు. తర్వాత ఆయన వైసీపీలో చేరారు. అనంతరం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కూడా పనిచేశారు. 2019లో వైసీపీ సీటు ఆశించినప్పటికీ అప్పటి సమీకరణాల కారణంగా ఆయనకు సీటు దక్కలేదు. కనీసం 2024 ఎన్నికలలో అయినా సీటు వస్తుందని ఆశించినప్పటికీ జగన్ తనకు మొండి చేయి చూపడంతో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.

Tags

Next Story