AP : ఏపీలో నాలుగు రోజులు వర్షాలు

AP : ఏపీలో నాలుగు రోజులు వర్షాలు
X

ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, NTR, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, YSR, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది. మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది.

ఏపీ వ్యాప్తంగా ఇవాళ రాత్రి విస్తృతంగా వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమను తాకిన ప్రభావంతో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల 40-60కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

వచ్చే నాలుగు రోజులపాటు తెలంగాణలోనూ వర్షాలు పడుతాయని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో రెండు రోజుల పాటు దంచికొట్టిన ఎండలు.. ఆదివారం కొంచెం తగ్గుముఖం పట్టాయి. రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.

Tags

Next Story