AP : ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ) ఆదేశాలతో అధికారులు ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన కార్యాచరణను రెడీ చేశారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్ల నుంచి ఇసుకను అందిస్తారు. అయితే, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇసుకను అందించాలని నిర్ణయం తీసుకుంది.
ప్రజల నుంచి కేవలం ఇసుక తవ్వకాల ఖర్చు, సీనరేజ్ మాత్రమే వసూలు చేయాలని తెలిపింది. ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిన నేపథ్యంలో అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా జరగకుండా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ నిఘా ఉంచనున్నాయి. అయితే దగ్గర్లో ఉన్న వాగులు, వంకల నుంచి స్థానికులు ఎడ్ల బండ్లలో ఇసుకను తెచ్చుకునేందుకు ఛాన్స్ కల్పించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటి వరకు ఉన్న కాంట్రాక్టర్లు, జీసీకేసీ, ప్రతిమ ఇన్ ఫ్రా పక్కకు తప్పుకున్నట్లు సీఎస్ చెప్పారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి ఈ నిల్వలను ప్రజలకు అందించడం ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com