- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- Kodali Nani: మంత్రి కొడాలి నానితో...
Kodali Nani: మంత్రి కొడాలి నానితో పాటు పలువురు ఎమ్మెల్యేల ఇంటి వద్ద భద్రత..

Kodali Nani (tv5news.in)
Kodali Nani: మంత్రి కొడాలి నానితో పాటు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌కు భద్రత పెంచింది ప్రభుత్వం. శాసనసభలో ఈమధ్య జరిగిన పరిణామాలపై కొందరు ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబు సతీమణిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై మండిపడుతున్న కొందరు.. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదులు అందాయి. అందుకే, ముందస్తు చర్యల్లో భాగంగగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడికి భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం 2+2 గన్ మెన్లతో భద్రత ఉంది. అసెంబ్లీ పరిణామాలు, సోషల్ మీడియాలో బెదిరింపుల తరువాత.. అదనంగా 1+4 గన్ మెన్లతో భద్రత కల్పిస్తోంది ప్రభుత్వం. కొడాలి నాని కాన్వాయ్‌లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌కు ప్రస్తుతం 1+1 గన్ మెన్లతో రక్షణ కల్పిస్తున్నారు. వీరితో పాటు అదనంగా 3+3 గన్ మెన్ భద్రత కల్పిస్తోంది ప్రభుత్వం.
చంద్రబాబుపై వ్యాఖ్యల తరువాత సోషల్ మీడియా వేదికగా.. కొడాలి, వల్లభనేని, అంబటి, ద్వారంపూడికి బెదిరింపులు వచ్చినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ నలుగురి భద్రతను సమీక్షించిన కమిటీ.. వీరికి తక్షణం భద్రత పెంచాలని సిఫార్సు చేసింది. దీంతో ఇవాళ్లి నుంచి మంత్రి కొడాలి, ఎమ్మెల్యేలు వంశీ, అంబటి, ద్వారంపూడిలకు అదనపు భద్రత సిబ్బందిని కేటాయించింది ప్రభుత్వం.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com