AP : విజయవాడ నుంచి 27, 28, 29 తేదీల్లో హజ్ యాత్ర

AP : విజయవాడ నుంచి 27, 28, 29 తేదీల్లో హజ్ యాత్ర
X

ఏపీ నుంచి 692 మంది ముస్లిములు హజ్ యాత్రకు వెళ్తున్నట్లు వక్ఫ్ బోర్డు సీఈవో అబ్దుల్ ఖదీర్ తెలిపారు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఈ నెల 27న ఉ.8.45కు 322 మంది బయలుదేరుతారన్నారు. 28న సా.4.55కు 322 మంది, 29న మ.2.50కు 48 మంది చొప్పున ప్రత్యేక విమానాల్లో హజ్ యాత్రకు వెళ్తారని పేర్కొన్నారు. ప్రయాణానికి 6 గంటల ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని సూచించారు.

హజ్ యాత్ర కోసం ఏపీ కోటా కింద 2,931 బెర్తులు కేటాయించారు. అయితే 2902 అప్లికేషన్లు రాగా.. దరఖాస్తుల పరిశీలన తర్వాత 2902 మందికి హజ్ కమిటీ అవకాశం కల్పించింది. అయితే వీరిలో 75 శాతం మంది వరకూ హైదరాబాద్, బెంగళూరుు, చెన్నై నుంచి ప్రత్యేక విమానాల్లో వెళ్లనున్నారు. విజయవాడ‌ను 839 మంది మాత్రమే ఎంచుకున్నట్లు ఏపీ సాంఘిక సంక్షేమ కార్యదర్శి హర్షవర్ధన్ తెలిపారు.

1239 మంది హైదరాబాద్ నుంచి, 810 మంది బెంగళూరు నుంచి, 14 మంది చెన్నై నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్నట్లు తెలిపారు. మిగతా 839 మంది గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు బయల్దేరి వెళ్తారని వివరించారు.

2024 సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, హజ్ యాత్రకు ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లను చేసిందని, జెడ్డా వెళ్లే యాత్రికులు, బయట వ్యక్తుల సహాయ సహకారాలు ఆశించకుండా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్ సదుపాయాన్ని వినియోగించుకుని తమ యాత్రను విజయవంతం చేసుకోవాలని సూచించారు. ‍హజ్ యాత్రకు వెళ్లే వారిని రాజకీయ పార్టీల ప్రతినిధులు కలవడంపై కూడా ఎన్నికల కోడ్, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని సూచించారు.

Tags

Next Story