AP : వివేకా రక్తపు మరకలు తుడిచింది ఆయనే.. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్యోదంతం 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన డెసిషన్ మేకింగ్ పాయింట్ గా మారింది. దీనిపై అటు టీడీపీ.. ఇటు వైసీపీ ఎటాకింగ్.. డిఫెన్సివ్ డైలాగ్స్ వదులుతున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసుపై కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు రక్తపు మరకలు తుడిచింది ఎర్ర గంగిరెడ్డి అని తెలిపారు. వివేకానంద రెడ్డితో కలిసి యర్ర గంగిరెడ్డి ఒకే కంచం, ఒకే మంచంలో తింటూ స్నేహంగా ఉండేవారని అన్నారు.
అటువంటి యర్ర గంగిరెడ్డి.. సాక్షాలను తారుమారు చేస్తూ ఉంటే అవినాష్ చూస్తూ ఉండిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. వివేకానంద రెడ్డి బావమరిది శివ ప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్ అక్కడికి వెళ్ళాడనీ.. వివేకాకు యర్ర గంగిరెడ్డి అత్యంత సన్నిహితుడని చెప్పారు.
సన్నిహితుడు కాబట్టే రక్తపు మరకలు తుడిచే సమయంలో అవినాష్ అడ్డుకోలేకపోయాడని వివరించారు రవీంద్రనాథ్ రెడ్డి. అక్కడికి వెళ్లి నిలబడినందుకే అవినాష్ పై ఆరోపణలు వచ్చాయి. అవినాష్ పై ఆరోపణలు చేస్తున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com