Heavy Rains : నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. ఇవాళ భారీ వర్షాలు

Heavy Rains : నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్..  ఇవాళ భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెలంగాణ లోని నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ లోని అల్లూరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు పురోగమించాయని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, దక్షిణ గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు సహా తెలంగాణలోకి ప్రవేశించనున్నాయని తెలిపారు.

ఆదివారం నుంచి సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు రాష్ట్రంలో అత్య‌ధికంగా వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల‌, దోమ‌, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిల‌లో 3 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. మ‌రికొన్ని జిల్లాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు కురిశాయి.

Tags

Next Story