Pension : పెన్షన్ల పంపిణీపై హైకోర్టులో నేడు విచారణ

Pension : పెన్షన్ల పంపిణీపై హైకోర్టులో నేడు విచారణ

పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారించనుంది. ఈసీ ఆదేశాలను రద్దు చేస్తూ.. వాలంటీర్లతో పెన్షన్లు ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. గతంలో వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్లు ఇచ్చేవారని.. తాజా ఆదేశాలతో సచివాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకోవడం లబ్ధిదారులకు కష్టంగా మారిందని పిటిషనర్ వాదించారు.

మరోవైపు సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి లేఖ రాశారు. ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా నా కుటుంబంపై జగన్ నిరాధార ఆరోపణలు చేశారు. విశాఖలో డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో మాకు వాటా ఉందని సీఎం ఓ సభలో మాట్లాడారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు.

Tags

Next Story