AMIT SHAH: వైసీపీ ఐదేళ్ల పాలన ఘోర విపత్తు

ప్రకృతి విపత్తులొచ్చినప్పుడు NDRF రక్షిస్తే.. మానవ ప్రేరేపిత విపత్తుల నుంచి NDA రక్షిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అయిదు సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వ పాలనలో అలాంటి విపత్తే సంభవించిందని.. ఆ విపత్తు నుంచి ఏపీని బయట పడేసేందుకు చంద్రబాబు- మోడీ జోడీ కృషి చేస్తోందని అమిత్ షా తెలిపారు. విజయవాడ సమీపంలోజాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ దక్షిణాది క్యాంపస్, ఎన్డీఆర్‌ఎఫ్ పదో బెటాలియన్ భవనాల ప్రారంభం, 20వ వ్యవస్థాపక దినోత్సవాల్లో కేంద్ హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. తిరుపతిలోని రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రెండు భవనాలను విజయవాడ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
అభివృద్ధి పనుల పరుగులు
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,440 కోట్లతో కేంద్రం మద్దతు ప్రకటించిందని. ఇది ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవంతో ముడిపడిన వ్యవహారం. స్టీల్‌ప్లాంట్ నిలదొక్కుకునేలా చేస్తామని అమిత్ షా తెలిపారు. చంద్రబాబు నిర్ణయించిన, మోఢీ శంకుస్థాపన చేసిన అమరావతిని గత ఐదేళ్లూ పక్కన పెట్టారని. రాజధాని పనులు వేగవంతంగా జరిగేందుకు ప్రధాని మోఢీ ప్రపంచబ్యాంకు, హడ్కో నుంచి రూ.27 వేలకోట్లు మంజూరుచేశారని గుర్తు చేశారు. రైల్వేజోన్‌కు శంకుస్థాపన చేశారు. 2028 నాటికి పోలవరం నీరు అందుతుంది’ అని అమిత్ షా చెప్పారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు జోడీకి బ్రహ్మాండమైన విజయం అందించారంటూ ఆంధ్రులకు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లోనూ ఎన్డీయే చరిత్ర సృష్టిస్తుందని ధీమా వెలిబుచ్చారు.
వైసీపీ పాలనలో ఘోర పరిస్థితులు
విజయవాడ సమీపంలోని కొండపావులూరు వద్ద జరిగిన ఎన్డీఆర్‌ఎఫ్ 20వ వ్యవస్థాపక వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలసి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎన్నికల ముందు పది లక్షల కోట్లకు పైగా అప్పులు.. రాజధాని పూర్తిగా విధ్వంసం.. కొట్టుకుపోయిన పోలవరం డయా ఫ్రమ్ వాల్.. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. అమరావతికి 15 వేల కోట్ల సాయం కేంద్రం నుంచి అందడంతో రాజధాని పనులు వేగవంతమయ్యాయని, పోలవరం డయా ఫ్రమ్ వాల్ పనులు తాజాగా మొదలయ్యాయని, ఈ రెండింటినీ పూర్తి చేసి తీరుతామన్నారు. దేశంలో ఏ మూల సమస్య ఉన్నా పరిష్కారానికి పట్టుదలతో కష్టపడే అమిత్ షా శాంతిభద్రతల పరిరక్షణలో వినూత్నంగా ఆలోచిస్తుంటారని చంద్రబాబు కొనియాడారు. సమస్యలపై లోతుగా అధ్యయనం చేసే అమిత్ షా నేతృత్వంలో దేశ నలుమూలలా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని కొనియాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com