Home Minister Anitha : నేనూ సోషల్ మీడియా బాధితురాలినే: హోంమంత్రి అనిత

వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవడానికే రెడ్ బుక్ అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైజాగ్ సీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఆమె సమావేశమయ్యారు. తాను సోషల్ మీడియా బాధితురాలినేనని చెప్పారు. అసభ్య పోస్టులపై చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. కేంద్ర నిధులొచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదన్నారు.
ఇక, సోషల్ మీడియాలో మహిళలపై దుష్ప్రచారాలు చేసేవారిపై కఠినచర్యలు ఉంటాయని, తాను కూడా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల బాధితురాలినేనని తెలిపారు. కాగా, గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా అనేక ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టులో ఉన్నాయని, ఇప్పుడు తాను మాట్లాడుతున్న సీపీ కార్యాలయం కూడా తాకట్టులో ఉందో, లేదో చూడాలని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో ఇప్పటికీ ఒక పోలీస్ స్టేషన్ రేకుల షెడ్డులోనే నడుస్తోందని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పటికీ సద్వినియోగం చేయలేదని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com