AP : ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి మళ్లీ చేదు అనుభవం

ఏపీ పురపాలక శాఖా మంత్రిగా నారాయణ ( Narayana ) బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మికి ( Sri Lakshmi ) చేదు అనుభవం ఎదురైంది. మంత్రిగా నారాయణ బాధ్యతల స్వీకరణ సమయంలో శ్రీలక్ష్మి ఒక ఫైల్ ను సంతకం చేసేందుకు నారాయణకు ఇవ్వగా.. ఆయన తిరస్కరించారు. ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ( CM Chandrababu Naidu ) బాధ్యతలు చేపట్టిన సమయంలో ముఖ్య అధికారులు మర్యాద పూర్వకంగా నారాయణను కలిసారు. ఆ సమయంలో చంద్రబాబుకు శ్రీలక్ష్మీ బొకేతో శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రయత్నించగా ఆయన తిరస్కరించారు. ఇలా వరుసగా కొత్త ప్రభుత్వంలో ఐఏఎస్ శ్రీలక్ష్మికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
రాష్ట్రంలో జగన్ సీఎం అయిన తరువాత ఐఐఎస్ శ్రీలక్ష్మీని కేంద్ర డీఓపీటీ ఏపీకి కేటాయించింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో శ్రీలక్ష్మీ సైతం ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం అదే హోదాలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అన్నా క్యాంటీన్లకు సంబంధించిన జీవో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీలక్ష్మీ జారీ చేయాల్సి ఉంది. కానీ, శ్రీలక్ష్మీ పేరుతో జీవోలు విడుదల కాకూడదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఫలితంగా సీఎస్ పేరుతో జీవోలు విడుదలయ్యాయి. శ్రీలక్ష్మికి పోస్టింగ్ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com