CM Chandrababu : టీడీపీతో పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నించిన వారు కాలగర్భంలో కలిసిపోయారు గానీ టీడీపీని ఏమీ చేయలేకపోయారన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. పార్టీ జెండాను ఆవిష్కరించి, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ వేడుకల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ , రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్, రాష్ట్ర మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. పార్టీ అవిర్భావ ముహూర్త బలం చాలా గొప్పదన్నారు. పార్టీ సంకల్ప బలం కూడా చాలా గొప్పదని, చరిత్రలో టీడీపీ హయాం స్వర్ణ యుగం అని చెప్పుకొనే రోజులు శాశ్వతంగా వస్తాయన్నారు చంద్రబాబు. 43 ఏళ్లు ఎన్నో సంక్షోభాలు వచ్చాయని వాటిని అవకాశంగా తీసుకుని విజయాలు సాధిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అవరాతవిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా జరిగాయి. అమరాతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com