Nara Lokesh :సీమకు వస్తున్న ఇంటర్నేషనల్ కంపెనీలు..

కూటమి ప్రభుత్వం ఏపీలోని అన్ని ప్రాంతాలను డెవలప్ చేసే పనుల్లో బిజీగా ఉంది. వైసీపీ హయాంలో కత్తులతో నెత్తురు పారిన సీమ.. ఇప్పుడు కూటమి హయాంలో అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇందుకోసం మంత్రి నారా లోకేష్ విపరీతంగా కష్టపడుతున్నారు. నిత్యం ఇంటర్నేషనల్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి.. సీమకు కంపెనీలు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఉన్న లేపాక్షి ఇండస్ట్రియల్ హబ్ కు కంపెనీలు ఇప్పుడు క్యూ కడుతున్నాయి. దీని వెనకాల కూటమి ఆరాటంతో పాటు లోకేష్ పట్టుదల రెండూ ఉన్నాయి. లోకేష్ ప్రయత్నాల వల్ల ఇప్పటికే చాలా ఇంటర్నేషనల్ కంపెనీలు అనంతపూర్ కు వచ్చాయి.
ఇందులో భాగంగా ఎయిర్ బస్ కంపెనీ అనంతపూర్ కు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఏరో స్పేస్, డిఫెన్స్ సంస్థలు కూడా అనంతపూర్ ఇండస్ట్రియల్ హబ్ వైపు చూస్తున్నాయి. కంపెనీలు వస్తే అనంతపూర్ రూపమే మారిపోతుంది. 20వేల ఎకరాల్లో ఈ కంపెనీలు అన్నీ ఏర్పాటు కాబోతున్నాయి. ప్రస్తుతం పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. బెంగుళూరుకు దగ్గర్లో ఉండే ఉమ్మడి అనంతపూర్ లో ఈ పరిశ్రమలు రావడం అంటే కచ్చితంగా భవిష్యత్ లో అనంతపూర్ అందనంత ఎత్తులో నిలబడుతుంది. ఎందుకంటే ఇటు హైదరాబాద్, అటు బెంగుళూరు, ఇంకోవైపు చెన్నై నగరాలకు మధ్యలో ఉంటుంది అనంతపూర్.
అందుకే ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి మరీ కంపెనీలు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీమలో ఇండస్ట్రియల్ హబ్ రావడం అంటే వెనకబడ్డ ఈ ప్రాంతానికి అతిపెద్ద ఊరట. ఇప్పటికే చాలా కంపెనీలు లోకేష్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించాయి. మరిన్ని కంపెనీలు త్వరలోనే రాబోతున్నాయి. స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్, ఐటీ, పరిశ్రమలు ఇలా మొత్తం 16 క్యాటగిరీల కంపెనీల ఏర్పాటుకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
గతంలో లేపాక్షికి అప్పగించిన 8,844 ఎకరాలు పోగా, మిగిలిన భూములను అధికారులు సేకరిస్తున్నారు. దీనికి తోడు మరో 12వేల ఎకరాలను ప్రభుత్వం కేటాయించి.. ఈ పరిశ్రమల రాకకు మార్గం సుగుమం చేసింది. అమరావతిని మాత్రమే డెవలప్ మెంట్ చేయకుండా ఇటు సీమతో పాటు అటు విశాఖ నగరానికి భారీగా కంపెనీలు తీసుకువచ్చి అన్ని ప్రాంతాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ కంపెనీల ఏర్పాటుకు అన్ని రకాల సదుపాయాలు ఉండటం మరో కలిసొచ్చే అంశం. అందుకే ఈ లేపాక్షి ప్రాంతం.. ఇప్పుడు ఏపీలోనే హాట్ టాపిక్ అవుతోంది. ఇక సేకరించిన భూములకు పరిహారం కూడా ఇచ్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దీని వల్ల త్వరగా పనులు చేసి కంపెనీలకు లైన్ క్లియర్ చేశారు. దీంతో ఏపీ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com