AP Inter Supplementary Exams : మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సెకండియర్ స్టూడెంట్స్‌కి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు పరీక్షలు జరుగుతాయి. మొదటి సంవత్సరం ఇంటర్‌లో 3,46,393 మంది, సెకండియర్‌లో 1,21,545 మంది విద్యార్థులున్నారు.
ఇంటర్ మెుదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్షల తేదీలు :
మే 24 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
మే25 - ఇంగ్లిష్ పేపర్ 1
మే 27 - పార్ట్ 3లో మ్యాథ్స్ పేపర్ 1ఎ, బోటని పేపర్ 1, సివిక్స్ పేపర్ 1
మే 28 -మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
మే 29 -ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1
మే 30 -కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1
మే 31 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1
జూన్ 1 -మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్ 1
జూన్ 6 -ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్
జూన్ 7- ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్
ఇంటర్ రెండో సంవత్సరం సప్లమెంటరీ పరీక్షల తేదీలు :
మే 24 -సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
మే 25 -ఇంగ్లీష్ పేపర్ 2
మే 27 -పార్ట్ 3లో మ్యాథ్స్ పేపర్ 2ఎ, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2
మే 28 -మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2
మే 29 -ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2
మే 30 - కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2
మే 31 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2
జూన్ 1 -మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్ 2
ఇక తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే విద్యార్థుల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com