జోగి వెనక జగన్.. లండన్ నుంచి సడన్ ఎంట్రీ..

ఏపీలో ఇప్పుడు కల్తీ మద్యం కేసు రోజురోజుకూ ముదురుతుంది. వైసిపి పెద్ద నాయకుల చుట్టూ ఈ కేసు నడుస్తోంది. ఇప్పటికే జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం పోలీసులకు అతి పెద్ద సాక్ష్యం అయింది. కానీ జోగి రమేష్ మాత్రం తనకసలు ఏమీ తెలియదన్నట్టు.. జనార్ధన్ రావు అంటే ఎవరో కూడా తెలియదని నానా రకాల అబద్ధాలు చెప్పేస్తున్నాడు. కానీ రేపో ఎల్లుండో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం పసిగట్టిన మాజీ సీఎం జగన్ రెడ్డి వెంటనే లండన్ నుంచి వచ్చేసారు. వాస్తవానికి జగన్ టూర్ ఈనెల 23వ తేదీ దాకా ఉంది. కానీ నాలుగు రోజుల ముందే ఇండియాకు తిరిగి వచ్చేసాడు. దీనికి అసలు కారణం జోగి రమేష్ ఒత్తిడి అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పార్టీ జోగి రమేష్ ను ఒక్కడినే ఇరికించేసి మిగతా వారంతా పక్కకు తప్పుకోవాలని ప్లాన్ చేశారంట.
దీంతో జోగి రమేష్ తాను అరెస్ట్ అయితే అందరి విషయాలు బయట పెడతానని.. కల్తీ మద్యం ద్వారా అందరూ డబ్బులు సంపాదించుకొని ఇప్పుడు తననొక్కడినే ఇరికించడం ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేశాడంట. దీంతో జోగి రమేష్ ఎక్కడ తమ వ్యవహారం అన్ని బయటపెడతాడో అని మాజీ సీఎం జగన్ ఆగమేఘాల మీద లండన్ నుంచి వచ్చేశాడు. ఈ కల్తీ మద్యం కేసులో వైసీపీకి చెందిన చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారాలు జరుగుతున్నాయి. వాళ్లంతా ఇప్పుడు జగన్ వద్దకు వెళ్లి తమను ఎలాగైనా కాపాడాలని.. ఏదో ఒకటి చేసి ఈ కేసును డైవర్ట్ చేయాలని కోరుతున్నారంట. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ కేసు నుంచి తన నాయకులను తన పార్టీని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు, జోగి రమేష్, ఆర్కె ఈ వ్యవహారంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. రీసెంట్ గానే ఆర్కేతో సంబంధాలు ఉన్న ఒక మహిళ ఆడియో కాల్ లీక్ అయింది. అందులో ఆమె జయచంద్ర రెడ్డి, జనార్దన్ రావు, ఆర్కే కలిసి కర్ణాటకలో ఈ లిక్కర్ దందాకు సంబంధించిన స్కెచ్ ఎలా వేసారో.. అందులో తనను ఇరికించాలని ఎలా చూశారో అన్నీ బయట పెట్టింది. తనకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉందని ఆమె వాపోయింది.
దీంతో ఈ కేసులో అత్యంత కీలక విషయం మరొకటి వెలుగులోకి వచ్చినట్టు అయింది. ఈ దెబ్బతో వైసిపి నేతలు అయోమయంలో పడ్డారు. జోగి రమేష్ కల్తిమద్యం దందాలో సంపాదించిన డబ్బులను అంతిమంగా ఎవరికి అందజేశారు.. అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఆయన అరెస్టయి వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో వైసీపీ ఈ విషయం నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే కందుకూరు ఘటన, నిన్న జరిగిన తుని ఘటనలో కులం కార్డు, పార్టీ కార్డును వాడేస్తోంది. కానీ ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వైసిపిని పట్టించుకునే పరిస్థితి లేదు. కల్తీ మద్యం దందాలో అసలు నిజాలు బయటకు వస్తే వైసిపి పార్టీ అధోగతి పాలు కావడం ఖాయం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com