AP : చిత్తూరులో జగన్ కు భారీ ఝలక్

AP : చిత్తూరులో జగన్ కు భారీ ఝలక్
X

చిత్తూరు జిల్లాలో జగన్ కు బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి సుధీర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి సుధీర్ ను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్ టీడీపీలో చేరారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని సుధీర్ అన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని సుధీర్ తెలిపారు.

Tags

Next Story