పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తాం...

జగన్ సర్కారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లను టార్గెట్ చేస్తోంది. తాజాగా సీఎం జగన్ గుడివాడ పర్యటన సందర్భంగా నిరసన వ్యక్తం చేసిన అనలేటి తులసీ అనే టీడీపీ కార్యకర్తకు మద్దుతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింనందుకు టీడీపీ నేత చంద్రబాబును అరెస్ట్ చేశారు గుడివాడ పోలీసులు. చంద్రబాబు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల టీడీపీ నేత. ఆయన స్వగ్రామం చోళసముద్రంకి వెళ్లి 41 నోటీసు ఇచ్చారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి గుడవాడకుకు తరలించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు స్థానిక టీడీపీ నేతలు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న కేశవ్ ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ధైర్యంగా ఉండాలంటూ ఆ యువకుడి కుటుంబసభ్యుల్ని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com