LOKESH: దోచుకోవడం.. దాచుకోవడమే జగన్ పని

కొండలు, క్వారీలు, పోర్టులు సహా దోచుకునేందుకు అవకాశం ఉన్న వేటినీ..... వైసీపీ నేతలు వదలడం లేదని... తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడమే జగన్ పని అని ఆరోపించారు. విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల శంఖారావం సభల్లో పాల్గొన్న ఆయన 2 నెలల్లో జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. తెలుగుదేశం- జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ యత్నిస్తోందన్న లోకేశ్ ... పసుపు సైన్యం, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే రెండు నెలలుచాలా కీలకమని, ఇరుపార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పోరాడి.... ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.తెలుగుదేశం హాయంలో ఎన్నో కంపెనీలను విశాఖకు తీసుకొస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని తరిమేసిందని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ కు ధీటుగా విశాఖను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
సిద్ధం సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ అల్లరి మూకల దాడిని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి నారాలోకేష్ తీవ్రంగా ఖండించారు. సిద్ధం సభ ఫోటోలు తీయడం నిషిద్ధమా, నేరమా అని నిలదీశారు. ఇది మీడియాపై జగన్ చేసిన ఫ్యాక్షన్ దాడి అని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేయించడం తగదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక పత్రిక, ఛానెల్ యజమాని అయిన జగన్ ఇటువంటి దాడులు ప్రోత్సహించడం, తన సంస్థల్లో పనిచేసే వారందరినీ రిస్క్ లో పెట్టడమేనని దుయ్యబట్టారు.
వైసీపీ మునిగిపోయే పడవ అని ఆ పార్టీ నేతలూ తెలుసుకున్నారని అందుకే పిలిచి సీటు ఇస్తామన్నా దణ్ణం పెట్టి పారిపోతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఓటమి భయం పట్టుకునే జగన్ ఇష్టానుసారం అభ్యర్థులను మార్చుతున్నారన్నారు. బీసీలు, ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామని జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని... ఇప్పుడు ఇచ్చే వాటికన్నా రెట్టింపు సంక్షేమ పథకాలు అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో శంఖారావం యాత్రలో పాల్గొన్న అయన... ఎస్.కోట, పెందుర్తి సభల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం తీసుకొచ్చిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో చూసి జగన్ భయపడిపోతున్నారని... అందుకే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలే నమ్మకపోవడంతో జగన్‌కు ఏం పాలుపోవడం లేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com