JANASENA: జగన్‌పై భగ్గుమన్న జనసేన

JANASENA: జగన్‌పై భగ్గుమన్న జనసేన
X
పవన్‌కల్యాణ్‌పై వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం.. పలుచోట్ల ఆందోళనలు

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. జగన్‌ ఇంగితం లేకుండా మాట్లాడితే తామూ ‘జగన్‌ కోడికత్తికి ఎక్కువ... గొడ్డలికి తక్కువ’ అని అనగలమని జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌ హెచ్చరించారు. పవన్‌కల్యాణ్‌పై జగన్‌ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదాను డిమాండ్‌ చేసే స్థాయిలో జగన్‌ లేరని... ఇది ప్రజలిచ్చేదనే విషయాన్ని పవన్‌కల్యాణ్‌ చెప్పారని గుర్తు చేశారు.

నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో కిషోర్ గునుకుల, నూనె మల్లికార్జున యాదవ్, కాకు మురళి పాల్గొన్నారు.

అక్రమ సంపాదనతో ఎదిగిన వ్యక్తి జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ సంపాదనతో ఎదిగిన ఒకే ఒక వ్యక్తి జగన్ అంటూ సత్తెనపల్లి పట్టణంలో బుధవారం జనసేన పార్టీ సమన్వయకర్త బుర్ర వెంకట అప్పారావు పేర్కొన్నారు. తమ నాయకుడు పవన్ పై జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తండ్రి శవంతో, అక్రమ సంపాదనతో రాజకీయాల్లో జగన్ ఎదిగారని కానీ ప్రజలు మాత్రం 11 సీట్లతో బుద్ధి చెప్పారంటూ పేర్కొన్నారు.

’మాజీ సీఎం జగన్ మాటలు హాస్యాస్పదం’

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు. 11 సీట్లే వచ్చిన జగన్... పవన్ కళ్యాణ్ పై మాట్లాడేటప్పుడు స్థాయి మర్చిపోకూడదన్నారు. రాష్ట్రంలో ప్రజలు నీ మీద నమ్మకం లేక 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదని విమర్శించారు.

అందాల పోటీలు పెడితే జగన్ వస్తారేమో: సోమిరెడ్డి

అందాల పోటీలు పెడితేనైనా జగన్ అసెంబ్లీకి వస్తారేమో అంటూ సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చురకలంటించారు. అసెంబ్లీ వద్ద ఆయన మాట్లాడుతూ.. 'మగవాళ్ల అందాలను వర్ణించడం జగన్‌కు అలవాటు. అసెంబ్లీ, శాసనమండలి సభ్యులకు క్రీడా పోటీలు నిర్వహిస్తామని స్పీకర్ ప్రకటించారు. పురుష ఎమ్మెల్యేలకు అందాల పోటీలు పెడితే.. వాటిని చూడటానికైనా జగన్ ఇష్టంగా అసెంబ్లీకి వస్తారనుకుంటున్నాం' అని సోమిరెడ్డి అన్నారు.

Tags

Next Story