PAWAN: వైసీపీ ఉగ్రవాద ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి

PAWAN:  వైసీపీ ఉగ్రవాద ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి
ప్రజలకు పవన్‌కల్యాణ్‌ పిలుపు... కూటమిదే పీఠమని ధీమా

ఏపీలో వైసీపీ ఉగ్రవాద ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా...... పొన్నూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వైకాపా పాలనలో విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు లేకుండా చేశారని మండిపడ్డారు. విపక్షాలపై కేసులు పెట్టి వేధించడం తప్ప......, ప్రజలకు చేసిందేమి లేదన్న పవన్‌..... జగన్ అరాచక పాలన ఇది నిదర్శనమన్నారు. మాట మాట్లాడితే సంక్షేమం అని చెప్పే జగన్‌కు.... ఏపీలో దశాబ్ధాలుగా పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబుకు సినిమా పాటలకు స్టెప్పులు వేయడం మాత్రమే తెలుసునని, పోలవరం గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ల్యాండ్ టైట్‌లింగ్ యాక్ట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పవన్‌ సూచించారు.


ముఖ్యమంత్రి పీఠం కూటమిదేనని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఉద్ఘాటించారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందనిఎన్ని సీట్ల మెజారిటీ వస్తుందన్నదే ప్రశ్న అని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ నేతల దాడులు, బూతులకు పన్నులు వేస్తే ఆ వచ్చే ఆదాయంతో ప్రభుత్వానికి నిధుల కొరత పూర్తిగా తీరిపోతుందని పవన్‌ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం దాడులు, దోపిడీలు మాత్రమే చేసే డబుల్‌ డి ప్రభుత్వమని పవన్‌ విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరూ స్వేచ్ఛగా బతకడానికి వీల్లేకుండా.....అందరూ బానిసలుగా ఉండాలని జగన్‌ కోరుకుంటున్నారని మండిపడ్డారు. చివరికి మన సభలకు స్థలాలు ఇస్తే.. వాళ్ల ఇళ్లను కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ బెదిరింపులన్నీ శాశ్వతంగా ఆగిపోతాయని పవన్‌ స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని జనసేనాని హామీ ఇచ్చారు. కాపీలు కొట్టి పాసయ్యే జగన్‌కు.. తెలుగు భాషలో ఉన్న మాధుర్యం, గొప్పతనం ఏం తెలుస్తాయని పవన్‌ విమర్శించారు. మాతృభాషను మరచిపోవద్దని కోరుతుంటే.. ఆంగ్లం వద్దంటున్నామని జగన్‌ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీ ఆస్తులు కాపాడుకోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని తెలిపారు. 30 కేసులుండి ఐదేళ్ల నుంచి జగన్‌ బెయిల్‌పై ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజల గుండెల్లో ధైర్యం నింపడానికే నేనొచ్చా నని వెల్లడించారు. మాటిస్తే ప్రాణాలు పోవాలిగానీ వెనక్కి తీసుకోకూడదని అన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుతో ఆస్తులు కాజేయాలని చూస్తున్నారని జగన్‌పై విరుచుకుపడ్డారు.ఇంట్లో ఉన్న వాళ్లను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి దాడులు, దోపిడీలు తప్ప చేసిందేమి లేదని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story