Pawan Kalyan : టీడీపీకి జనసేనాని స్పెషల్ విషెస్

తెలుగు దేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రీటింగ్స్ తెలిపారు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్. భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షించారు. ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు పవన్ కల్యాణ్. 1982 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు. ప్రజల గొంతుకగా తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ సీఎం NTR స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉందన్నారు. నాటి నుండి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు టీడీపీ శ్రీకారం చుట్టిందన్నారు.
జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, ప్రజల పక్షాన నిలిచిందన్నారు పవన్ కళ్యాణ్. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబుకు , జాతీయ కార్యదర్శి లోకేష్ , టీడీపీ AP అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు పవన్ కల్యాణ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com