జోగి రమేశ్ అలా.. జగన్ ఇలా.. ఏంటీ అబద్దాలు

జోగి రమేశ్ అలా.. జగన్ ఇలా.. ఏంటీ అబద్దాలు
X

ఏపీలో సంచలనం రేపుతున్న కల్తీమద్యం కేసు వైసీపీ నేతల మెడకు చుట్టుకుంటోంది. ఇందులో కీలక నిందితుడు అయిన జనార్థన్ రావు పోలీసుల ముందు సర్వం చెప్పేశాడు. అసలు కల్తీ మద్యం ఎక్కడ తయారైంది, ఎవరు చేయించారు, ఆ స్పిరిట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, ఆ డబ్బంతా ఎవరెవరికి ఇచ్చేశారనేది ఒప్పేసుకున్నారు. కేవలం జోగి రమేశ్ పేరు చెప్పారు జనార్థన్ రావు. అయితే జనార్థన్ రావు విషయంలో జోగి రమేశ్ ఒకలా చెబుతుంటే.. జగన్ మరోలా చెబుతున్నాడు. పాపం ఇద్దరికీ సెపరేట్ స్క్రిప్టు ఇస్తున్నారేమో. అందుకే ఇద్దరి సమాధానాలకు పొంతన ఉండట్లేదు. జనార్థన్ రావు చిన్నప్పటి నుంచి తనకు తెలుసు అని జోగి రమేశ్ స్వయంగా చెప్పారు.

వాళ్ల ఇళ్లు, తమ ఇళ్లు ఎదురెదురుగా ఉండేవని.. చిన్నప్పుడు జనార్థన్ రావు వాళ్లకు ఒక చిల్లర దుకాణం ఉండేదని స్వయంగా జోగి అంటున్నారు. కానీ జగన్ మాత్రం.. జోగి రమేశ్ కు జనార్థన్ రావు ఎవరో అస్సలు తెలియదని.. వారిద్దరికీ అసలు ముఖ పరిచయమే లేదు అన్నట్టు పచ్చి అబద్దాలు ఆడేస్తున్నారు. ఇది విన్న ఏపీ ప్రజలు కూడా వీళ్ల అబద్దాలకు షాక్ అవుతున్నారు. ఎందుకంటే స్వయంగా జోగి రమేశ్ తనకు జనార్థన్ రావు తెలుసు అని చెబుతుంటే.. జగన్ ఎందుకు మార్చి చెబుతున్నాడు. ఇక్కడే వీళ్ల అబద్దాల చిట్టా బయట పడుతోంది. జోగి రమేశ్ తాను ఇరుక్కుంటే అందరినీ ఇరికించేయడానికి రెడీ అవుతున్నాడంట.

అది తెలుసుకున్న జగన్.. ఇప్పటికే జోగి రమేశ్ కు కొన్ని సలహాలు ఇచ్చారు. జనార్థన్ రావు ఎవరో తెలియదని చెప్పాలని.. అధికారులు బయట పెట్టిన వాట్సాప్ చాటింగ్ అంతా ఫేక్ అని మొత్తుకోవాలంటూ సూచించారంట. కానీ అప్పటికే జోగి రమేశ్ జనార్థన్ రావు తెలుసని ఒప్పేసుకున్నారు. దీంతో ఎరక్కుపోయి ఇరుక్కుపోయినట్టు మారింది వైసీపీ పరిస్థితి. అయినా సరే అబద్దాలు ఆడటంతో ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే జగన్.. ఇలా జనార్థన్ రావు ఎవరో తెలియదన్నట్టు బిల్డప్ ఇచ్చేశారు. వైసీపీ ఏం చెప్పినా జనాలు నమ్మేస్తారు అనేది వాళ్ల భ్రమ. ఆ భ్రమలోనే ఇలాంటి ఫేక్ ప్రచారాలకు తెర తీస్తోంది వైసీపీ. కానీ అసలు నిజాలు త్వరలోనే తెలుస్తాయి.

Tags

Next Story