AP: చేతులెత్తేస్తున్న జగన్ టీమ్

సార్వత్రిక ఎన్నికలకు ముందే జగన్ ఎమ్మెల్యేలు చేతులెత్తేస్తున్నారు. ఓవైపు వైనాట్ 175 అని కెప్టెన్ సవాళ్లు విసురుతుంటే మిగతా ఆటగాళ్లు మ్యాచ్ మొదలుకాకుండానే రిటైర్డ్ హార్ట్ ప్రకటిస్తున్నారు. 81వేల మెజార్టీతో గెలిచిన ఒక MLA రేసు నుంచి తప్పుకోగా..జగన్ సొంత మనిషిగా ముద్రపడిన మరో MLA కూడా సైడైపోయారు. ఒక MLC అయితే ఏకంగా నాలుగేళ్లు పదవీకాలాన్ని వదులుకుని జగన్‌కు దండం పెట్టేశారు. జగన్‌పై MLAలకు నమ్మకం పోయిందా.. వైకాపా పుట్టిమునుగుతోందనే భావనకు వచ్చేశారా.? ఇంతకీ వైకాపాలో....... ఏం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో 81 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచి జగన్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే రెండో అత్యధిక మోజార్టీ నెలకొల్పిన ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఈసారి బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. వైసీపీలో పెత్తనం చెలాయిస్తున్న ఒక ప్రధాన సామాజికవర్గ నేతలు తనను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన వాపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ఏమీ అభివృద్ధి చేయాలేకపోయానని.... సన్నిహితుల ఎదుట అన్నా రాంబాబు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో జనంలో పలుచనపడేకన్నా పోటీ నుంచి తప్పుకోవడమే మేలని అన్నారాంబాబు భావించినట్లు చర్చజరుగుతోంది..
విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యదవ్, మరో నాలుగేళ్లు మండలి సభ్యత్వం ఉన్నా లెక్కచేయకుండా వైసీపీకి వీడ్కోలు పలికారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేస్తిన వంశీకృష్ణ సొమ్ములు బాగానే పోగొట్టుకున్నారట. బీసీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పుకనే జగన్ ఆ సామాజిక వర్గానికి చెందిన వంశీని ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నుంచి కార్పొరేటర్‌కు దించేశారు. విశాఖ మేయర్ పదవిఇస్తామంటూ నమ్మించి కార్పొరేటర్‌గా పోటీ చేయించారు. గెలిచాక మేయర్ పదవి ఇవ్వలేదు. అదేంటని అడుగుదామని ప్రయత్నించిన వంశీకి జగన్ అపాయింట్‌మెంట్ కూడా దక్కలేదు. వంశీకృష్ణ కోరుకుంటున్న విశాఖ తూర్పు నియోజకవర్గంలో స్థానం లేకుండా చేసి.. MLCతో సరిపెట్టుకోమన్నారు. కనీసం 2024లోనైనా టికెట్ ఇవ్వాలని వంశీ కోరుతుంటే వైసీపీ పెద్దలు ఆ స్థానాన్ని విశాఖ ఎంపీ MVV సత్యనారాయణకు అప్పగించారు. ఇప్పటికే విశాఖ మేయర్ వెంకటకుమారి, VMRDA ఛైర్‌పర్సన్ విజయనిర్మల గ్రూపులు వంశీకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే ఇప్పుడు వారి ఎంపీ కూడా జతకలిశారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డైతే వైసీపీతో పాటు ఎమ్మెల్యే సభ్యత్వానికీ రాజీనామా చేసేశారు. వైసీపీ విపక్షంలో ఉన్నపుడు, జగన్ కంటే టీడీపీని ఇరుకున పెట్టేందుకు ఆర్కేనే ఎక్కువ పనిచేశారు. వైసీపీ అధికారంలోకొచ్చాక కూడా చంద్రబాబుపై లేనిపోని కేసులు మోపి న్యాయస్థానాల చుట్టూ తిరిగేలా చేస్తూ ఒక రకంగా వేధింపులకు గురి చేశారు. RKను మంత్రివర్గంలోకి తీసుకోకుండా జగన్ మాటతప్పినా.. ఆయనెప్పుడూ అడగలేదు. మరో 4నెలలు పదవీకాలం ఉన్నప్పటికీ.. ఆర్కే వదిలేసున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com