LOKESH: జగన్‌.. బీసీల ద్రోహీ: లోకేశ్‌

LOKESH: జగన్‌.. బీసీల ద్రోహీ: లోకేశ్‌
జనవరి నాలుగున జయహో బీసీ కార్యక్రమం.... ఓడిపోయే సీట్లే బీసీలకు ఇస్తున్న వైసీపీ

బీసీలు బలహీనులు కాదు, బలవంతులన్నదే తెలుగుదేశం నినాదమని... ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ స్పష్టంచేశారు. జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అని ఆయన మండిపడ్డారు. జయహో బీసీ పేరిట జనవరి 4న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుందని లోకేష్ తెలిపారు. ఓడిపోయే సీట్లను బీసీలకు వైసీపీ ప్రభుత్వం ఇస్తోందని మండిపడ్డారు. జనసేనతో సమన్వయం బాగా కొనసాగుతోందని లోకేష్ సుస్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదరణ పథకాన్ని రద్దు చేసి నామమాత్రపు కార్పొరేషన్ పదవులను కట్టబెట్టిన జగన్ బీసీల ద్రోహి అని ధ్వజమెత్తారు.

జనవరి 4న చేపట్టబోయే 'జయహో బీసీ' కార్యక్రమం వివరాలను లోకేష్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే సీట్లను వైసీపీ బీసీలకు ఇస్తోందని లోకేష్ విమర్శించారు. మంగళగిరిలో రెండు సార్లు రెడ్లకే టిక్కెట్ ఇచ్చారన్న లోకేష్, ఇప్పుడు మంగళగిరిలో ఓడిపోతున్నామని తెలిసే బీసీకి టిక్కెట్ ఇచ్చారని ప్రశ్నించారు. తమకు 175 నియోజకవర్గాలకు గానూ 170 సెగ్మెంట్లకు ఇన్ఛార్జులున్నారని అన్నారు. జనసేనతో సమన్వయం కొనసాగుతుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించిన అధికారుల పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో రాసి వారిపై న్యాయ విచారణ వేస్తామన్నామని లోకేష్ తెలిపారు. తప్పు చేసిన ఏ అధికారినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ఎన్నికల ముందు వ్యూహం లాంటి సినిమాలు తీసి ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. వ్యూహం సిమిమాకు ప్రతివ్యూహం ఉండకూడదంటే ఎలా అని నిలదీశారు.

Tags

Next Story