Vijayawada : రేపటి నుంచి దుర్గగుడిలో శివరాత్రి ఉత్సవాలు

Vijayawada : రేపటి నుంచి దుర్గగుడిలో శివరాత్రి ఉత్సవాలు

Vijayawada : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో (Durga Malleswara Swamy Temple) ఈనెల 6 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈవో కేఎస్‌ రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ఉత్సవమూర్తులకు మంగళస్నానాలు చేయిస్తారు. అనంతరం వధూవరులుగా అలంకరిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠాపన, మండపారాధన పూజ, ధ్వజారోహణ, బలిహరణ, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుగుతాయి.

7వ తేదీ గురువారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 6.30 గంటల వరకు మండపారాధన, అవుపాసనలు, బలిహరణ, మూలమంత్ర హవనం, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుగుతాయి. 8వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మల్లేశ్వరస్వామికి త్రికాల అర్చనలు, అభిషేకాలు, రాత్రి 9.30 గంటలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 12.30 గంటలకు గంగా పార్వతీ సమేత మల్లేశ్వరుల దివ్యలీలా కల్యాణోత్సవం జరుగుతాయి.

9వ తేదీ శనివారం ఉదయం 8 నుంచి మండపారాధన పూజ, అవుపాసనలు, బలిహరణ, మూలమంత్ర హవనం, 9 గంటలకు మల్లేశ్వరాలయంలో సదస్యం, వేదస్వస్తి, సాయంత్రం 4 గంటలకు మండపారాధన, అవుపాసనలు, బలిహరణ, మూలమంత్ర హవనం, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, రథోత్సవం జరుగుతాయి.

Tags

Next Story