AP : అర్ధరాత్రి హైడ్రామా.. ఎస్పీ ముందు పిన్నెల్లి హాజరు

AP : అర్ధరాత్రి హైడ్రామా.. ఎస్పీ ముందు పిన్నెల్లి హాజరు
X

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. మూడు కేసుల్లో జూన్‌ 6 వరకూ ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులివ్వగా... రాత్రి 9 గంటలకు ఆయన నరసరావుపేట చేరుకుని స్థానికంగా ఓ హోటల్‌లో బస చేశారు.

రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ఎదుట హాజరయ్యారు. కోర్టు విధించిన షరతులలో ప్రతిరోజూ ఎస్పీ ఎదుట హాజరు కావాలన్నది ఒకటి. అయితే, మొత్తం అన్ని కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి ఉపశమనం పొందేవరకూ పిన్నెల్లిని పట్టుకోలేకపోవటం రాష్ట్ర పోలీసుల వైఫల్యానికి నిదర్శనం.

ఈవీఎం విధ్వంసం, హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలతో నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు.

Tags

Next Story