AP : కిరణ్ కుమార్ రెడ్డిదే ఆ పాపం.. MP మిథున్ రెడ్డి హాట్ కామెంట్

AP : కిరణ్ కుమార్ రెడ్డిదే ఆ పాపం.. MP మిథున్ రెడ్డి హాట్ కామెంట్
X

ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి హైలైట్ అవుతున్నారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన చివరి సీఎం ఆయనే కావడం విశేషం. తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు అవుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి చుట్టూ ఓ నియోజకవర్గంలో రాజకీయం నడుస్తోంది.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్ సభ సెగ్మెంట్ లో బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఆయనపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టిన పాపం కిరణ్ కుమార్ రెడ్డిదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విజభన జరిగినతర్వాత పదేళ్లలో కిరణ్ కుమార్ రెడ్డి పది మంది పేదలకు కూడా సహయం చేయలేదని ఎద్దేవా చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రాలో మరోమ కేఏ పాల్ అని సెటైర్ వేశారు మిథున్ రెడ్డి. ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారని ఆరోపించారు. జూన్ 4 ఎన్నికల ఫలితాల రోజున కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ ప్యాకప్ చెప్పేసి వెళ్లిపోతాడని అన్నారు. మరోవైపు.. కిరణ్, పెద్దిరెడ్డి మధ్య కూడా డైలాగ్ వార్ నడుస్తోంది. సత్యసాయి ఆస్తులు కాజేశారన్న అంశంపై ఇద్దరిమధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.

Tags

Next Story