Alluri District : తల్లికూతుళ్లు సజీవ దహనం...అల్లూరి జిల్లో విషాదం...

Alluri District : తల్లికూతుళ్లు సజీవ దహనం...అల్లూరి జిల్లో విషాదం...
X

అల్లూరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీవీ చూస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో తల్లి కూతుళ్లు మృత్యువాతపడ్డారు. రంపచోడవరం మండలం నిమ్మలపాలెంలో ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం...నిమ్మలపాలెం కు చెందిన గాయత్రి తన ఆరేళ్ల కూతురు సాయి పల్లవి టీవీ చూస్తుండగా ఇంట్లో పనుల్లో మునిగిపోయింది. టీవీ చూస్తున్న చిన్నారి నిద్రలోకి జారుకుంది. ఈ తరుణంలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో కూతుర్ని కాపాడడానికి వచ్చిన తల్లి కూడా మంటల్లోనే ఆహుతి అయింది. తల్లి కూతుర్లు ఇలా ఒకేసారి చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

Tags

Next Story