AP : విషాదం.. బిడ్డ మరణవార్త విని తల్లి గుండె ఆగింది

AP : విషాదం.. బిడ్డ మరణవార్త విని తల్లి గుండె ఆగింది
X

అల్లూరి జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. అడ్డుమండకు చెందిన నిండు గర్భిణి రమ్యప్రియ(25)కు పురిటినొప్పులు రావడంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నర్సులు ఆపరేషన్ చేసి శిశువును బయటికి తీయగా అప్పటికే బిడ్డ మరణించింది. కొద్దిసేపటి తర్వాత ఈ విషయం తల్లి రమ్యప్రియకు తెలియడంతో ఆమె షాక్‌కు గురై గట్టిగా కేకలు వేస్తూ ప్రాణాలు విడిచింది. రమ్యప్రియ సచివాలయ మహిళా పోలీస్‌గా పనిచేస్తున్నారు. అప్పుడే పుట్టిన చనిపోవడం ఒక విషాదం అయితే.. కన్నతల్లి బిడ్డ మరణవార్త చనిపోయిందని తెలుసుకుని అడ్డుమండ గ్రామస్థులు, బంధువులు, కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తల్లీబిడ్డను కోల్పోయిన రమ్యప్రియ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Tags

Next Story