AP: ఉద్రిక్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె

AP: ఉద్రిక్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె
X
పలుచోట్ల అరెస్టులు, వాగ్వాదాలు, తోపులాటలు.. మండిపడ్డ పారిశుద్ధ్య కార్మికులు

ఆంధ్రప్రదేశ్ లో 12వ రోజు పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. పోలీసుల అరెస్టులు.. వాగ్వాదాలు, తోపులాటలతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత తలెత్తింది. విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్-2 కార్యాలయం వద్ద కార్మికులు భారీ ఆందోళన చేశారు. కడప మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కార్మికులు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మున్సిపల్ కార్యాలయంలోకి కార్మికులు దూసుకెళ్లి అధికారులను అడ్డుకున్నారు. కార్మికులను పోలీసులు బయటకు ఈడ్చుకెళ్లారు. అనంతపురంలో రోడ్డుపై బైఠాయించిన కార్మికులను పోలీసులుస్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత తలెత్తింది. శ్రీకాకుళం జిల్లా... పలాస-కాశీబుగ్గ పురపాలక కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు అధికారులు లోపలికి వెళ్లకుండా గేట్ వద్ద బైఠాయించారు. NTR జిల్లా నందిగామలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడికి.. వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో గేటు వద్ద బైఠాయించారు. గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. ఒంగోలు మున్సిపల్ కార్యాలయం వద్ద చెత్త వాహనాలను ప్రైవేట్ కార్మికులతో బయటకు తీసే ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుగా బైఠాయించారు. కార్మికులను పోలీసులు పక్కకు తీసే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది.


:సీఎం జగన్‌ మనసు మర్చాలంటూ నెల్లూరులో బారాషాహీద్‌ దర్గాలో మున్సిపల్‌ కార్మికులు ప్రార్థించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఒంగోలు మున్సిపల్‌ కార్యాలయం నుంచి చెత్త సేకరణ వాహనాలను బయటకు రానివ్వకుండా.... గేటు ఎదుట బైఠాయించారు. మున్సిపల్‌ కమిషనర్‌ వాహనాన్ని అడ్డుకుని డిమాండ్లు వినిపించారు. పోలీసులు అడ్డగింపుతో.. వాగ్వాదం జరిగింది.


కడప నగర పాలక కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాటతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. రాజంపేటలో మున్సిపల్‌ కార్యాలయంలోనికి....అధికారులను రానివ్వకుండా కార్మికులు అడ్డుకోగా..పోలీసులు వారిని ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్లారు. మహిళలనూ ఈడ్చేయడంతో పోలీసు తీరును నిరసిస్తూ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోనూ మున్సిపల్‌ కార్యాలయ ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు ఈడ్చేయడంతో... ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మున్సిపాలిటీ సిబ్బందిని బయటకు పంపించిన కార్మికులు....కార్యాలయానికి తాళాలు వేసి.... ఆందోళన చేశారు. అనంతపురం నగర పాలక సంస్థ వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో.... ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

Tags

Next Story