Nara Lokesh: మహానాడు తర్వాత జగన్‌వి రెండు పెద్ద కుంభకోణాలు బయటపెట్టబోతున్నా- లోకేష్

X
Nara Lokesh: మహానాడు తర్వాత సీఎం జగన్‌వి రెండు పెద్ద కుంభకోణాలు బయటపెడతానన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టామన్నారు. ఇందులో భాగంగా దీర్ఘకాలం పదవుల విధానం రద్దు చేయాలనే ప్రతిపాదనకు వచ్చినట్లు తెలిపారు. దాన్ని తన నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపారు లోకేష్. జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 సార్లు చేశానని.. ఈసారి తప్పుకుని వేరేవారికి అవకాశం ఇస్తానని చెప్పారు. 2సార్లు వరుసగా ఒకే పదవిలో ఉన్నవారికి బ్రేక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. అటు 3సార్లు వరుసగా ఓడిపోయిన వారికి ఈఎన్నికల్లో టికెట్లు ఇవ్వొద్దనే చర్చ కూడా చేస్తున్నామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
