- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- పొత్తుల విషయం మా పార్టీ అధినేత...
పొత్తుల విషయం మా పార్టీ అధినేత చూసుకుంటారు: నారా లోకేష్

ఇతర పార్టీలతో పొత్తుల విషయం తమ పార్టీ అధినేత చంద్రబాబు చూసుకుంటారన్నారు TDP జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్. పొత్తులపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పటికే ఆరేడు సార్లు కూర్చుని మాట్లాడుకున్నారన్నారు. మహానాడు కారణంగా ఇటీవల కలవలేదని.. మళ్లీ ఇద్దరూ కూర్చుంటారన్నారు లోకేష్. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం దేవగుడిలోని విడిది కేంద్రంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. BJPతో పొత్తు గురించి విలేకరులు ప్రస్తావించగా..మేమేమైనా పొత్తు కోసం ఆ పార్టీని కలిశామా అని ప్రశ్నించారు.
ఐదేళ్లు పాలించాలని జనం YCPకి అధికారమిచ్చారని, పాలన చేతకాక ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే.. ఎందుకు హామీలు అమలు చేయలేదో జగన్ జనానికి చెప్పి వెళ్లాలన్నారు లోకేష్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు TDP సిద్ధంగా ఉందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న జగన్.. వారంలో రద్దుచేస్తానన్న CPS ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛన్ హామీలు ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. మద్య నిషేధం, ప్రత్యేక హోదా, మెగా DSC, 2.30లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు మరికొన్ని హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
ఇక పనిచేయని TDP ఇన్‌చార్జులను మార్చేస్తామన్నారు లోకేష్. ప్రజల్లో ఉండి పనిచేసేవారికే పదవులు వస్తాయన్నారు. మహానాడులో TDP మేనిఫెస్టో దాదాపు ఖరారైందని.. 80 శాతం మహానాడులో ప్రకటించినవే ఉంటాయన్నారు. ‘చంద్రబాబు ఒక బ్రాండ్ అనదబాకం. పరిశ్రమలు తీసుకొస్తామని, ఇప్పుడున్న టెక్నాలజీ అనుబంధంగా కేజీ నుంచి పీజీ వరకు సిలబస్ మారుస్తామన్నారు. . అప్పుడు దేశంలో ఎక్కడా లేని చదువుకున్న యువత మన దగ్గర ఉంటారని, కంపెనీలు సైతం క్యూ కడతాయన్నారు. జగన్ నాలుగేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఎద్దేవా చేశారు.తామొస్తే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి చేస్తామన్నారు. ఒక్క పరిశ్రమతోనే అభివృద్ధి జరగదని.. భౌగోళిక పరిస్థితుల కనుగుణంగా ఇతర పరిశ్రమలు స్థాపిస్తామన్నారు లోకేష్.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com