ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని నయా నియంత జగన్‌ చంపేస్తున్నారు : నారా లోకేశ్

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని నయా నియంత జగన్‌ చంపేస్తున్నారు : నారా లోకేశ్
వైసీపీ రౌడీ మూకలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు నారా లోకేశ్.

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని నయా నియంత జగన్‌ చంపేయిస్తున్నారంటూ కామెంట్ చేశారు నారా లోకేశ్. 25వేల కోట్ల లిక్కర్ మాఫియాను ఎండగట్టినందుకు చిత్తూరు జిల్లాలో ఆటో డ్రైవర్ ఓం ప్రతాప్‌ని చంపేశారన్నారు. తాజాగా ప్రకాశం జిల్లా బెస్తవాపేట మండలం శింగరపల్లె గ్రామంలో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు వెంగయ్యను చంపేశారని అన్నారు. జగన్‌ చెత్త పాలనను ప్రశ్నించినందుకు..వారిని చంపేసి ఆత్మహత్య చేసుకున్నారంటూ కేసును మూసేయడం ఫ్యాక్షన్ రాజకీయాలకు నిదర్శనం అని విమర్శించారు. ఇవి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. వైసీపీ రౌడీ మూకలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు నారా లోకేశ్.

గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే రాంబాబును ప్రశ్నించారు వెంగయ్యనాయుడు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబును ప్రశ్నించిన.. జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్యనాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశ్నించిన మూడ్రోజులకే అతను ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమాలకు తావిస్తోంది.

దీనిపై తీవ్రంగా జనసేన స్పందించింది. వెంగయ్యనాయుడి ఆత్మహత్యకు ఎమ్మెల్యే రాంబాబు కారణమని ఆరోపించింది. గ్రామంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కరించమని అడిగినందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన నేతలు. తమ కార్యకర్త మరణం బాధకరమంటూ జనసేన ప్రకటన విడుదల చేసింది. ఈ ఆత్మహత్యకు వైసీపీ బాధ్యత వహించాలని, ఇది వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనమని జనసేన మండిపడింది. కనీసం సమాధానం ఇవ్వలేని స్థితలో ఎమ్మెల్యే రాంబాబు ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన యువకుడిని ప్రజల మధ్య ఎమ్మెల్యే బెదిరించారని, వివిధ రూపాల్లో అతనిపై ఒత్తిడి తెచ్చినట్టు తమకు సమచారం ఉందని జనసేన చెబుతోంది.


Tags

Next Story