ఆంధ్రప్రదేశ్

Nara Lokesh : మాట తప్పడంలో జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు : లోకేష్

Nara Lokesh : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి..

Nara Lokesh :  మాట తప్పడంలో జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు :  లోకేష్
X

Nara Lokesh : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి రాగానే మాట మార్చి మోటార్లకు మీటర్ల బిగిస్తున్నారని దుయ్యబట్టారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌. మాట తప్పడానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్‌ గా మారారన్నారు. నాడు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను బాదుడే బాదుదంటూ రాగం తీసిన జగన్ రెడ్డి అధికారం చేపట్టాక అతి ఎక్కువ ధరలకు విక్రయించే పరిస్థితి వచ్చిందన్నారు. విద్యుత్ కేటగిరీలను రద్దుచేసి 6స్లాబులను తీసుకొచ్చి ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ మరో పిడుగు వేసిందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడంపై జగన్ స్పందించాలన్నారు. టీడీపీ హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తుంటే అపోహలు సృష్టించడంతో పాటు అబద్దాలు ఆడారని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్ని డిమాండ్ చేశారు.

Next Story

RELATED STORIES