AP: జగన్‌కు పతాకస్థాయికి ప్రచార పిచ్చి

AP: జగన్‌కు పతాకస్థాయికి ప్రచార పిచ్చి
ఎన్నికల తర్వాత జగన్‌ పారిపోతారన్న లోకేశ్‌.... జగన్‌ అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటన

జగన్‌కు ప్రచార పిచ్చి పట్టుకుందని అందుకే కోట్లు ఖర్చు పెట్టి ఆయనపైనే సినిమాలు తీయించుకుంటున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. పార్టీ ఎమ్మెల్యేలు డబ్బులు పెట్టి టిక్కెట్లు కొంటున్నా ఆయన్ను తెరపై చూసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదన్నారు. ఊరూరా బోర్డులు పెట్టించుకుంటున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. సొంత ఇంట్లోవాళ్లే జగన్‌ను నమ్మడం లేదని ఇక ప్రజలేం నమ్ముతారని ప్రశ్నించారు. నారా లోకేశ్ చేపట్టిన ఎన్నికల శంఖారావం యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది. పాతపట్నం బహిరంగ సభలో పాల్గొన్న లోకేశ్... వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారని.... బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్‌లు ఎత్తివేశారని..., తూతూ మంత్రంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారని లోకేశ్ విమర్శించారు. జగన్ డబ్బులిచ్చి ఎంత ప్రచారం చేసుకున్నా... చంద్రబాబు దరిదాపుల్లోకి కూడా రాలేరన్నారు..


వైసీపీ ఎమ్మెల్యేల అవినీతికి అంతే లేకుండా పోతోందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని పాతపట్నంలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. అనంతరం పాలకొండ చేరుకున్న లోకేశ్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్‌కు ఇంకోసారి అవకాశం ఇస్తే ప్రజల భూములను కూడా కాజేస్తారని... ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని నమ్మొద్దని లోకేశ్ హితవు పలికారు. ఎన్నికల ముందు జగన్‌ తీయని మాటలు చెప్పారని.. అధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోయారన్నారు. ఏటా డీఎస్సీ అని చెప్పి ఎన్నికల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నట్లు చెప్పారు. రెండు నెలలు ఓపిక పట్టాలని.. నిరుద్యోగులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఈ మధ్య జగన్‌.. మీ బిడ్డ.. మీ బిడ్డ.. అని అంటున్నారని.. ప్రజలు జాలి చూపించొద్దని సూచించారు. పొరపాటున జగన్‌ ఎన్నికల్లో గెలిస్తే మీ బిడ్డనే కదా.. మీ భూమి తీసుకుంటానంటారని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.


మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ బోర్డులు పెడుతున్నారు. మీ తల్లి, సోదరే మిమ్మల్ని నమ్మడం లేదు.. మేమెలా నమ్ముతాం? ప్రాణహాని ఉందని షర్మిల, సునీత చెప్పే పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేని జగన్‌.. రాష్ట్ర ప్రజలకు కల్పించగలరా?జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన షర్మిలను బెదిరిస్తున్నారు. గన్‌ను చూస్తే కటింగ్‌, ఫిట్టింగ్‌ మాస్టర్‌ గుర్తొస్తారు. ఆయనకు 2 బటన్లు ఉంటాయి. బల్లపై ఒక బ్లూ బటన్‌, బల్ల కింద ఎర్ర బటన్‌. బ్లూ బటన్‌ నొక్కితే ఖాతాలో రూ.10 పడతాయి.. ఎర్ర బటన్‌ నొక్కగానే రూ.100 పోతాయి. 9 సార్లు విద్యుత్‌, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. భవిష్యత్తులో పీల్చే గాలికీ జగన్‌ పన్ను వసూలు చేస్తారేమో’’ అని వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story