కళావెంకట్రావు అరెస్టును తీవ్రంగా ఖండించిన నారా లోకేశ్

కళా వెంకట్రావు అరెస్టును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. అధికారం అండతో ఇంకెంతమంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తారని ధ్వజమెత్తారు. రామతీర్థంలో రాముడి విగ్రహం తల ఎత్తుకెళ్లిన వారిని ప్రభుత్వం పట్టుకోలేకపోయిందని లోకేశ్ నిప్పులు చెరిగారు.
కళా వెంకట్రావు అరెస్ట్‌ను అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. వైసీపీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. వైసీపీకి తిరుపతి ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం పట్టుకుందని మండిపడ్డారు. రామతీర్థం ఘటనకు బాధ్యులైన దోషులను వదిలి, బీసీ నేతను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.
అటు జగన్ సర్కారు పరిమితి దాటి వ్యవహరిస్తోందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. కళావెంకట్రావు అరెస్ట్... అత్యంత దుర్మార్గమని ధ్వజమెత్తారు.
కళావెంకట్రావు అరెస్టును నిరసిస్తూ.. ఇవాళ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిని ఎండగడతామని ఆ పార్టీ నేతలు
తేల్చిచెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com