AP : పేదరికం లేని మంగళగిరి నా కల: నారా లోకేశ్
పేదరికం లేని మంగళగిరి (Mangalagiri) తన కల అని నారా లోకేశ్ (Nara lokesh) అన్నారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని పేదలకు 20 వేల ఇళ్లు ఇస్తానని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కులతో పట్టాలు అందజేస్తానని హామీనిచ్చారు. మంగళగిరిలో ఓడినా ఇక్కడే ఉంటూ సొంత నిధులతో సేవ చేస్తున్నానని తెలిపారు. రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేయడం జగన్ నైజమని మండిపడ్డారు.
తొమ్మిది సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. మంగళగిరి ప్రజలు వరుసగా రెండుసార్లు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్లు ఇవ్వలేని స్థితిలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఉన్నారని విమర్శించారు. తాను చిరు వ్యాపారులకు నాలుగేళ్లుగా తోపుడు బండ్లు ఇస్తున్నానన్నారు. మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే మాస్టర్ ప్లాన్ తన వద్ద ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటానన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com