కృష్ణారావు మృతిపై నారా లోకేష్‌ దిగ్భ్రాంతి..!

కృష్ణారావు మృతిపై నారా లోకేష్‌ దిగ్భ్రాంతి..!
వైసీపీ దాడిలో టీడీపీ కార్యకర్త గరికపాటి కృష్ణారావు చనిపోయారన్న సమాచారం తెలుసుకున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు లోకేష్‌

వైసీపీ దాడిలో టీడీపీ కార్యకర్త గరికపాటి కృష్ణారావు చనిపోయారన్న సమాచారం తెలుసుకున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు లోకేష్‌. సత్తెనపల్లె రూరల్‌ మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన కృష్ణారావు హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. కృష్ణారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు లోకేష్‌.

ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను ఫ్యాక్షన్ చేసిన జగన్‌ రెడ్డి, నామినేషన్‌ వేశారన్న కారణంతో కొందరిని చంపేశారన్నారు. వైసీపీకి ఓట్లు వేయకపోతే.. పథకాలు తీసేస్తామని వాలంటీర్‌ వ్యవస్థతో బెదిరించి మరీ ఓట్లేయించుకున్నారన్నారు. ఇన్ని అరాచకాలకు ఎదురొడ్డి గెలిచిన టీడీపీ మద్దతుదారులను చివరికి అంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయినా టీడీపీ కానీ.. టీడీపీ కార్యకర్తలు కానీ భయపడరని, జగన్‌ నియంత పాలననని అంతమొందించేవరకు పోరాడుతునే ఉంటామన్నారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story