AP: అరాచకాలు వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తూ...
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాయి. ఐదేళ్లుగా జగన్ చేసిన అరాచకాలను కూటమి అభ్యర్థులు ప్రజలకు వివరించారు. తాము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ వజ్రకరూరు మండలంలో ప్రచారం చేశారు. వివిధ గ్రామాల్లో తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయమంటూ ఓటర్లను అభ్యర్థించారు. సంక్షేమం పేరిట వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమంతోపాటు... అభివృద్ధి చేస్తామని పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆదోని కూటమి అభ్యర్థి పార్థసారథి పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. తర్వాత వార్డుల్లో పర్యటించారు. వైకాపా MLA సాయిప్రసాద్‌రెడ్డి... వాల్మీకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓట్లకు విజ్ఞప్తి చేశారు.
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ప్రచారం చేశారు. కూటమి విజయంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మండలి బుద్ధప్రసాద్ ప్రజలకు వివరించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. కరపత్రాలు పంచుతూ.. గాజుగ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ లంక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి కృష్ణతులసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలతో కలిసి 20వ వార్డులో పర్యటించారు. కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు మహిళలకు వివరించారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ ఒక్క కుటుంబం సంతోషంగా లేదని కృష్ణతులసి అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కూటమి అభ్యర్థి కూన రవికుమార్ సతీమణి ప్రమీల..... పట్టణంలోని అనేక కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రమీలకు మహిళల నుంచి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది.
Tags
- NDA CANDIDATES
- CAMPAIGNING
- FULL SWING
- IN AP
- TDP CHIEF
- NARA CHANDRABABU NAIDU
- SUGGESTIONS
- TO TDP CANDIDATES
- JAGAN
- STOME CASE
- VICTIM
- DURGARAO
- SENSATIONAL
- COMMENTS
- TELUGU DESHAM PARTY
- LEADERS
- MEET
- CEC
- IN DELHI
- Chandrababu
- supporters
- CHANDRABABU
- Chandrababu. family members. Pawan kalyan
- clarity
- 2024 elections
- cbn
- tdp
- chandrababu naidu
- tv5
- tv5news
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com