AP : ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ ( Neerab kumar prasad ) నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని ( K S Jawahar Reddy ) బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబును నీరభ్ కుమార్ నిన్న మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. ప్రస్తుత CS జవహర్ రెడ్డి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు.
మరోవైపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడుతుండడంతో సీఎంఓ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు చూడనున్నారు. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com