ఆంధ్రప్రదేశ్

AP Corona Cases: ఏపీలో కొత్తగా 2,498 పాజిటివ్ కేసులు

AP Corona Cases: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

AP Corona Cases
X

AP Corona Cases 

AP Corona Cases: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,498 కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 88,149 పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మహమ్మారి బారిన పడి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,178కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,37,52,356 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. గత 24 గంటల వ్యవధిలో 2,201 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,07,201కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,843 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,44,222 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.Next Story

RELATED STORIES