AP : "పవన్ కళ్యాణ్ కు ఓటు వేయద్దు".. నీహారిక మాజీ భర్త సంచలనం

మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారా లేదా అన్నదే ఏపీలో చాలా ఆసక్తికరమైన అంశంగా మారిపోయింది. జనసేన పార్టీ తరపున పవన్ తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. ఆయనకు సపోర్ట్ చేయాలి అంటూ పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
కాగా ఇలాంటి క్రమంలోనే మెగా మాజీ అల్లుడు జొన్నలగడ్డ చైతన్య జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వాళ్లపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. నిహారిక జొన్నలగడ్డ చైతన్య విడాకులు ఇప్పటికే తీసుకున్నారు. ఇలాంటి మూమెంట్లో పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ కామెంట్స్ చేశాడు అని వార్తలు వినిపించడం సంచలనంగా మారింది.
'పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలు అందరూ కూడా భయంతోనే చేస్తున్నారు అని ..ఒకవేళ ప్రచారం చేయకపోతే నెక్స్ట్ సినిమాలో ఆఫర్స్ ఇవ్వను అంటూ పవన్ కళ్యాణ్ భయపెడుతున్నాడు అని జనసేన ను నమ్మి ఎంతో మంది మోసపోయారు అని.. మెగా ఫ్యామిలీ అంటేనే స్వార్థపూరిత రాజకీయాలు అని ..దయచేసి పవన్ కళ్యాణ్ కి ఎవరు ఓటు వేయొద్దు అని చైతన్య చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com