వైసీపీకి అండగా అధికారులు.. కూటమి సీరియస్..

ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా పనిచేస్తోంది. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ తో పాటు మెటా డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్, క్వాంటమ్ కంప్యూటర్స్ లాంటివి వచ్చేశాయి. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆయా కంపెనీలను కోరుతున్నారు. విశాఖలో జరిగే బిజినెస్ సమ్మిట్ కు రావాలంటూ పిలుస్తున్నారు. అటు నారా లోకేష్ కూడా ఆస్ట్రేలియాలో వరుస మీటింగ్ లు పెడుతూ కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. వీరు ఇలా ఏపీ కోసం కష్టపడుతుంటే.. ఏపీలోని కొందరు అధికారుల తీరు మాత్రం అధ్వానంగా ఉంటోంది.
గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు వారితో అంటకాగుతూ అవినీతికి పాల్పడ్డారు. ఇప్పటికీ అధికారులు వైసీపీకి సపోర్టుగానే పనిచేస్తున్నారు. వైసీపీ నేతలతో ఉన్న లింకులను తెంచుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న పనులను పక్కన పెట్టేస్తున్నారు. అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నారు. మొన్ననే భీమవరం డీఎస్పీ మీద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. అవినీతి ఎక్కువయిందని సీరియస్ అయ్యారు. నిన్న అనంతపూర్ లో డీఎస్పీ మీద జేసీ ఫైర్ అయ్యారు. శాంతిభద్రతలు గాలికి వదిలేశారన్నారు. అటు డీఆర్వో భవానీ శంకర్ మీద ఆర్డీవో శ్రీలేఖ కంప్లయింట్ చేసింది.
కానీ వీరిద్దరినీ కూటమి ప్రభుత్వం వేరే డిపార్టుమెంట్ కు ట్రాన్స్ ఫర్ చేసింది. ఇలా ఏపీలోని చాలా చోట్ల అధికారుల మీద ఫిర్యాదులు వస్తున్నాయి. కూటమి తీసుకొస్తున్న సంక్షేమ పథకాల అమలులో, అభివృద్ధిలో వీరు అడ్డంకిగా మారుతున్నారనే కంప్లయింట్లు ఉన్నాయి. చాలా మంది పోలీసులు వైసీపీ నేతలు అడ్డగోలుగా రెచ్చిపోతున్నా సరే యాక్షన్ తీసుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కూటమి ఇలాంటి అధికారులపై సీరియస్ యాక్షన్ కు రెడీ అవుతోంది. ఇలాంటి వారిని సెలెక్ట్ చేసి ట్రాన్స్ ఫర్లు చేసేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే వీరిపై కఠిన చర్యలు ఉంటాయని తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com