BUDAMERU: బుడమేరు గండ్లు పూడ్చివేత విజయవంతం

BUDAMERU: బుడమేరు గండ్లు పూడ్చివేత విజయవంతం
మంత్రి నిమ్మల నేతృత్వంలో నిరంతరాయంగా పనిచేసిన అధికారులు.. అభినందించిన చంద్రబాబు

బుడమేరు గండ్లను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే రెండు గండ్లను పూడ్చగా.. తాజాగా మూడో గండిని అధికారులు పూడ్చివేశారు. నాలుగు రోజులుగా గండ్ల పూడ్చివేత కొనసాగుతుండగా చివరి గండిని అధికారులు పూడ్చి వేశారు. భారీ వర్షాలు, వరద ఉధృతితో బుడమేరుకు మూడు గండ్లు పడ్డాయి. మూడో గండి పూడ్చివేత పూర్తి కావడంతో బెజవాడకు తప్పిన వరద ముప్పు తప్పింది. వర్షంలోనే మూడో గండి పూడ్చివేత కొనసాగింది. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో గండ్ల పూడ్చివేత కొనసాగింది. గండ్లను విజయవంతంగా పూర్తిచేసిన మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు లెఫ్ట్ బండ్ మూడు గండ్లు సీఎం చంద్రబాబు సూచనలతో పూడ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

పనులు ఆపకుండా, తీవ్ర గాలులను లెక్క చేయకుండా పని చేశామన్నారు. మిలిటరీ సైతం మా పనులను అభినందించిందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం కమిట్మెంట్ కారణంగానే ఇదంతా సాధ్యమైందన్నారు. చంద్రబాబు కలెక్టరేట్‌లో ఉండి రెండు గంటలు కూడా నిద్రపోలేదన్నారు. మంత్రులు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటున్నారని.. కూటమి ప్రభుత్వం కమిట్మెంట్ ఇది అని వ్యాఖ్యానించారు. బుడమేరుకు మరో 8వేల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే అప్పటి సీఎం జగన్‌ పట్టించుకోలేదని విమర్శించారు.

విజయవాడలో మళ్లీ భారీ వర్షం

విజయవాడలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. దీంతో వరద బాధితుల సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే విజయవాడలో పలు చోట్ల వరద తగ్గింది. అలాగే బుడమేరు వాగు మూడు గండ్లను అధికారులు పూడ్చివేశారు. అయితే మరోసారి వర్షం పడుతుండటంతో విజయవాడ వాసులు ఆందోళన చెందుతున్నారు.

విరాళాల సేకరణ

నందవరం మండల పరిధిలోని ముగతిలో విజయవాడ వరద బాధితులకు విరాళాలు, బియ్యం సేకరిస్తున్నట్లు టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ముగతి ఈరన్న గౌడ్ గ్రామ అధ్యక్షులు ముగతి భార్గవ్ యాదవ్ తెలిపారు. మాట్లాడుతూ విజయవాడలో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు చేయూతను అందించడం కోసం బియ్యం, నగదు సేకరిస్తున్నట్లు తెలియజేశారు.


Tags

Next Story