AP: జగన్‌పై మండిపడ్డ ప్రతిపక్షాలు

ప్రజాసంక్షేమం పేరిట వైసీపీ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. విజయవాడలో బీజేపీ జిల్లా సంయోజకులు, ఇన్ ఛార్జ్ లు, విస్తారకుల రాష్ట్రస్థాయి సమావేశంలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. బీజేపీ జాతీయ సహఇన్ ఛార్జి శివప్రకాష్ ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్నవారి నుంచి ఇటీవల స్వీకరించిన దరఖాస్తులను నేతలు పరిశీలించారు. పొత్తుల గురించి జాతీయ నాయకత్వం స్పష్టత ఇస్తుందని మరోసారి పార్టీ శ్రేణులకు బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు...... ప్రభుత్వ మార్పును ఆశిస్తున్నారని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రివర్స్ బారోయింగ్ పేరుతో తెచ్చిన..... 91వేల 253 కోట్లు ఏం చేశారో లెక్క చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. తాజా బడ్జెట్ అంచనాల సమయంలో ఈ అవకతవకలు బయటపడ్డాయని.... తెలిపారు. ఈ సొమ్ములు ఎటు మళ్లించారో జగన్ ప్రభుత్వం చర్చకు రావాలని..... నాదెండ్ల సవాల్ చేశారు. నిధుల దుర్వినియోగంపై కాగ్ విచారణ చేయాలని... కోరారు. జగన్ భీమిలి సభలో చంద్రబాబు, పవన్ కటౌట్లు ఏర్పాటుచే.సి..... అమానుషంగా ప్రవర్తించడం జగన్ పైశాచిక ఆనందానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులుఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటు సైన్యంలా మారి బలహీన వర్గాలపై మారణహోమం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వెల్దుర్తిలో తెలుగుదేవం సానుభూతిపరులైన మత్స్యకారులను వైకాపాలో చేరాలని, లేదంటే 2లక్షలు కప్పం కట్టాలని SI శ్రీహరి వేధించడంతో బెస్త సోదరుడు దుర్గారావు బలవన్మరణానికి పాల్పడ్డాడని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నేతలకు తొత్తుగా మారి దుర్గారావుపై తప్పుడు కేసు బనాయించడం ద్వారా ఆ మత్స్యకారుడి ఆత్మహత్యకు కారణమయ్యారని, ఇది యావత్ పోలీసు శాఖకే మాయని మచ్చ అని లోకేశ్ దుయ్యబట్టారు. దేశంలో ఇలాంటి విపరీతపోకడలు మరెక్కడా లేవని చెప్పిన లోకేశ్ .. రాబోయే ప్రజాప్రభుత్వంలో కఠినచర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com