సీఎం జగన్‌పై టిడిపి ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఫైర్

సీఎం జగన్‌పై టిడిపి ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఫైర్
ఏపీకి రాజధాని నిర్మించాలనుకోవడం చంద్రబాబు చేసి తప్పా అని ప్రశ్నించారు అనురాధ.

ఏపీ సీఎం జగన్‌పై టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌రెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ పార్టీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారన్న ఆమె.. ఏపీకి రాజధాని నిర్మించాలనుకోవడం చంద్రబాబు చేసి తప్పా అని ప్రశ్నించారు. చంద్రబాబును ఎదుర్కోవడం వైఎస్ వల్లే కాలేదన్న విషయం జగన్ గ్రహించాలన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్, క్విడ్ ప్రోకో గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ రాజధాని కోసం అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారని అనురాధ ఆరోపించారు.


Tags

Read MoreRead Less
Next Story