Papikondalu : పాపికొండల విహారయాత్రకు 4 రోజుల పాటు బ్రేక్

Papikondalu : పాపికొండల విహారయాత్రకు 4 రోజుల పాటు బ్రేక్

వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 4 రోజుల పాటు యాత్రను నిలిపివేస్తున్నామన్నారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన ఈ పాపికొండల పర్వతశ్రేణి అందాలు ఆకట్టుకుంటాయి. గోదావరిపై లాంచీ ప్రయాణం, జలపాతాలు, గ్రామీణ వాతావరణం పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి.

రుతుపవనాల విస్తరణతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడుతుండగా… మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంది. ఉరుములు, మెరుపులతోపాటు 30-40Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇక ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags

Next Story