Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై ఎనిమిది కేసులు

Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై ఎనిమిది కేసులు

పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆస్తులు, అప్పుల వివరాలతో పాటుగా తనపైన నమోదైన కేసులతో కూడిన అఫిడవిట్‌ను ఆయన సమర్పించారు. తనపై ఎనిమిది కేసులు ఉన్నట్టు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. వలంటీర్లపై వ్యాఖ్యల నేపథ్యంలో మూడు ప్రైవేటు కేసులు ఉన్నట్టు తెలిపారు. వీటితోపాటు ఏలూరు, కృష్ణలంక, తాడేపల్లి పీఎస్‌ల్లో మూడు క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలోని తొర్రూరు, బంజారాహిల్స్‌ పీఎస్‌లలో రెండు క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్‌కు రూ.164.51 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రూ.65.77 కోట్ల అప్పులు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, బంగారం ఇతర చరాస్తుల విలువ రూ.41.65 కోట్లు. భార్య అన్నాలెజినోవా పేరు మీద రూ.కోటి రూపాయల ఆస్తి ఉంది. పవన్‌ పేరిట రూ.94.41 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. భార్య పేరుతో రూ.1.95 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. పవన్‌కు రూ.14 కోట్ల విలువైన 9 కార్లు, ఒక ట్రక్కు, హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌ ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story